
Ananya Panday: బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే నటిస్తున్న సీరీస్ కాల్ మీ బె. అనివార్య కారణాల వల్ల ఫ్యామిలీకి దూరమైన బెల్లా చౌదరి అనే అమ్మాయి... సొసైటీలో ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తూ తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 6 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనుంది ఈ సీరీస్. లేటెస్ట్ గా విడుదలైన అనన్య పిక్ స్టైలిష్‌గా ఉంది.

Ajay Devgn: అజయ్ దేవ్ గణ్ హీరోగా 'మిషన్ మంగళ్' ఫేమ్ జగన్ శక్తి ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. జగన్ వినిపించిన కథ చాలా బావుందని, వెంటనే అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. 2025 ప్రారంభంలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు అజయ్ దేవ్‌గణ్.

Rashmika Mandanna: తనతో నటించిన హీరోల్లో ఫేవరేట్ స్టార్ గురించి చెప్పారు నటి రష్మిక మందన్న. రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ తన ఫేవరేట్ అని అన్నారు. తాను దేవుడిని బాగా నమ్ముతానని, పూజలు చాలా చేస్తానని చెప్పారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని ఈ విషయాలను పంచుకున్నారు నటి రష్మిక మందన్న.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. హంగేరిలోని బుడాపెస్ట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సైఫ్‌తో ఉన్న రెండు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు సిద్ధార్థ్. తన ఫస్ట్ సినిమా హీరోతో మళ్లీ సెట్లో అడుగుపెట్టినట్టు చెప్పారు. జ్యువెల్ థీఫ్‌కి సంబంధించిన థీమ్‌తో తెరకెక్కిస్తున్నట్టు టాక్.

Ravi Teja: రవితేజ హీరోగా నటిస్తున్న 75వ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఆల్రెడీ రవితేజ, శ్రీలీల కలిసి సూపర్‌హిట్ సినిమా ధమాకాలో నటించారు.