
కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ పూజిత పొన్నాడ. కానీ ఆ సినిమా ద్వారా అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత అక్కినేని నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆతర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత. రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి ప్రేయసి గా కనిపించింది. సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా కూడా తన అందంతో నటనతో కట్టిపడేసింది పూజిత.

రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత రాజ్ తరుణ్ రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, రాజశేఖర్ కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ సినిమాల్లో మెప్పించింది.

అలాగే మాస్ మహారాజ రవితేజ రావణాసుర సినిమాల్లో కీలక పాత్ర పోషించింది. కానీ ఆ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మకు అనుకుంత క్రేజ్ మాత్రం రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తునా.. అందం అభినయం రెండూ ఉన్న కూడా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రావడంలేదు.

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కనిపించి ఆకట్టుకుంది. అలాగే ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోందీ అందాల తార. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని క్రేజీ ఫోటోలు షేర్ చేసింది పూజిత.. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.