
ప్రపంచంతో మనం కూడా ముందుకెళ్లాలంతే.. అలా కాదు ఒంటరిగా నడుస్తానంటే తంటాలు తప్పవు. మొన్నటి వరకు పూరీ తనదైన రూట్‌లోనే నడిచారు.. కానీ ఇప్పుడు మందతో పాటే నేను కూడా అంటున్నారు.

డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసారు. లేటైనా లేటెస్టుగా రావాలని చూస్తున్నారు డబుల్ ఇస్మార్ట్ టీం.

మార్చ్ 8న సినిమాను విడుదల చేయాలనుకున్నా.. చెప్పిన టైమ్‌కు రావట్లేదు ఈ చిత్రం. షూటింగ్ ఇంకా 30 శాతం బ్యాలెన్స్ ఉండటంతో.. హడావిడిలో పూర్తి చేయడం కంటే క్వాలిటీ కోసం టైమ్ తీసుకోవాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ విజయంలో మ్యూజిక్ పాత్ర కీలకం. మణిశర్మ చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.

డబుల్ ఇస్మార్ట్‌కు దాన్ని మించే పాటలివ్వాలని ప్లాన్ చేస్తున్నారు మణి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మకు మళ్లీ ఆ స్థాయి సినిమా పడలేదు. అందుకే కసిగా కష్టపడుతున్నారు ఈ సీనియర్ సంగీత దర్శకుడు. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్‌పైనా ఫోకస్ చేస్తున్నారు పూరీ.

లైగర్ డిజాస్టర్‌కు డబుల్ ఇస్మార్ట్‌తో సమాధానమివ్వాలనే కసితో ఉన్నారు పూరీ. మరోవైపు రామ్ కూడా వారియర్, స్కందతో డిసప్పాయింట్ చేసారు.

ఈ రిజల్ట్స్ ప్రభావం తమ సినిమాపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు పూరీ, రామ్. కచ్చితంగా డబుల్ ఇస్మార్ట్‌తో దేశాన్ని ఊపేయాలని ఫిక్సైపోయారు. ఎప్రిల్ లేదంటే మేలో ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉంది.