
గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లారు రామ్ చరణ్. ప్రైవేట్ ఫ్లైట్‌లో విశాఖ చేరుకున్న చరణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచే రామ్ చరణ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గేమ్ ఛేంజర్ భారీ షెడ్యూల్ వైజాగ్‌లోనే ప్లాన్ చేసారు శంకర్. 2024లోనే విడుదల కానుంది ఈ చిత్రం.

అజిత్ హీరోగా ప్రస్తుతం మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో విడా ముయార్చి సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సినిమాపై కూడా అధికారిక ప్రకటన వచ్చింది. మార్క్ ఆంటోనీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాక్ అగ్లీ అనే సినిమా చేస్తున్నారు అజిత్. దీన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం గమనార్హం.

ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పటికీ జపాన్‌లో సంచలనాలు రేపుతూనే ఉంది. తాజాగా రాజమౌళి జపాన్ పర్యటనకు వెళ్లడానికి రెడీ అయ్యారు. మార్చి 18న ఆయన అక్కడికి వెళ్తున్నారు. ఓ ప్రముఖ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షో చూస్తారని సమాచారం ఇవ్వగా.. అది తెలిసిన ప్రేక్షకులు ఆ షో టికెట్ల కోసం ఎగబడ్డారు. వేల మంది బుకింగ్ కోసం ప్రయత్నించగా.. నిమిషం వ్యవధిలోనే షో సోల్డ్ ఔట్ అయిపోయింది.

గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా యాట సత్యనారాయణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. 1947 ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించారు. తాజాగా ఈ చిత్రం విడుదలైంది. ఎన్నో వివాదాలను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది రజాకార్. విడుదలైన అన్ని భాషల్లో విజయాన్ని అందుకుంది.

సీతా శ్రీనివాస్, శివాని శర్మ ప్రధాన పాత్రల్లో సుమన్ కీలక పాత్రలో నటించిన సినిమా అనన్య. మార్చి 22న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రసాద్ రాజు బొమ్మిడి తెరకెక్కించిన అనన్య సినిమా ప్రీ రిలీజ్ వేడక ఘనంగా జరిగింది. దీనికి సినిమా యూనిట్ అంతా హాజరయ్యారు.