
కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్2 రిలీజ్ ప్రమోషన్లు శంకర్‌కి కూడా కీలకం. సో అప్పుడు చిన్న గ్యాప్ తీసుకోవడం కంపల్సరీ.

అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు దాదాపు 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ చేయడం అంటే మాటలు కాదు. అదే చేస్తున్నారిప్పుడు శంకర్.

కొత్తగా వచ్చిన పాటను చూస్తుంటే పాతికేళ్ళ నాటి భారతీయుడులోని కొన్ని విషయాలు బాగా గుర్తుకొస్తున్నాయి. మరి అవేంటి..? అసలు ఇప్పుడొచ్చిన పాట ఎలా ఉంది..? శంకర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ భారతీయుడు.

మామూలుగానే సీక్వెల్ అన్నప్పుడు ముందు సినిమాకు సంబంధించి రిఫరెన్సులు వాడుకుంటారు దర్శకులు. అభిమానులు కూడా అదే ఊహిస్తుంటారు. భారతీయుడు 2 కోసం శంకర్ కూడా ఇదే చేస్తున్నారు.

షూటింగ్ పూర్తైందంటారు కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు శంకర్. పార్ట్ 2తో పాటు ఒకేసారి మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకుడు. రెండింటికి కలిపి పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి.. ఆ ప్రభావం రిలీజ్ డేట్‌పై పడుతుంది.