
Rakul Preet Singh Wedding

రకుల్, జాకీల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

రితీష్ దేశ్‌ముఖ్, వరుణ్ ధావన్, నటాషా దలాల్, భూమి పెడ్నేకర్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానా, తాహిరా కశ్యప్‌చ అర్జున్ కపూర్, మహేష్ మంజ్రేకర్ తదితర బాలీవుడ్ స్టార్స్ రకుల్ వివాహ వేడుకలో సందడి చేశారు.

అలాగే సమంత, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జెనీలియా, అతియా, మృణాళ్ ఠాకూర్ తదితర సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రకుల్, జాకీలకు శుభాకాంక్షలు తెలిపారు.

పెళ్లి సందర్భంగా పింక్ లెహెంగా ధరించింది రకుల్. అలాగే చేతికి మ్యాచింగ్ గాజులు, మెడలో భారీ ఆభరణాలు ఈ కొత్త పెళ్లి కూతురి అందాన్ని రెట్టింపు చేశాయి.

సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న రకుల్, జాకీల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 'చూడముచ్చటైన జంట' అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.