
ఈ రెండు సినిమాల కాస్టింగ్ బలంగా ఉంది. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. వెట్టైయాన్‌లోనూ రానా, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

అదే హిట్ అయితే మరో రకమైన కంగారు ఉంటుంది. ఇప్పుడు తాను అదే టెన్షన్‌లో ఉన్నట్లు తెలిపారు సూపర్ స్టార్. జైలర్ తర్వాత వస్తుండటంతో వేట్టయన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి.. రజినీ భారాన్ని దించేసింది జైలర్. మొన్నామధ్య లాల్ సలామ్ ఫ్లాపైనా.. అది రజినీ సినిమా కాదు. అందుకే ఆశలన్నీ వేట్టయన్‌పైనే ఉన్నాయి.

వేట్టయాన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంటే, లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా ఇప్పుడు సెట్స్ మీదుంది. ఈ సినిమాలోనే అక్కినేని నాగార్జున గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రుతిహాసన్ కూడీ కీ రోల్ చేస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ మూవీగా రెడీ అవుతోంది కూలీ.

టిజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. తాజాగా జరిగిన ఆడియో వేడుకలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ముందు సినిమా ఫ్లాపైతే.. హీరోకు ఓ రకమైన టెన్షన్ ఉంటుంది.