
నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సినిమాలో రజనీ స్టైల్, యాక్షన్‌కు ఎంత రెస్పాన్స్ వచ్చింది.

ఇందులో మలయాళీ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ చేసిన గెస్ట్ రోల్స్‌కు కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్‌లోనూ ఈ అతిథి పాత్రలు కీ రోల్ ప్లే చేశాయి. ఇది ప్రేక్షకులను మెప్పించింది.

జైలర్ విషయంలో సక్సెస్ అయిన స్టార్ గెస్ట్ ఫార్ములాను అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు రజనీకాంత్. అందుకే త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న వేట్టయన్ సినిమాలోనూ గెస్ట్ రోల్స్ గట్టిగానే ప్లాన్ చేశారు.

T. J. జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న వేట్టయన్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ అతిథి పాత్రల్లో నటించారు. ఆ తరువాత చేస్తున్న కూలీ సినిమాలో కూడా ఓ స్టార్ గెస్ట్‌ను రంగంలోకి దించుతున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. ఆల్రెడీ ఈ సాంగ్‌కు సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ప్రతీ సినిమాలో అదర్ లాంగ్వేజ్ స్టార్స్ హెల్ప్ తీసుకుంటూ బిగ్ హిట్స్‌ను టార్గెట్ చేస్తున్నారు.