- Telugu News Photo Gallery Cinema photos Rajamouli's son Karthikeya is traveling on a different path than his father
SS Karthikeya: తండ్రిలా మెగాఫోన్ కాకుండా.. మరో దారిలో కార్తికేయ.. ఆయన దారేంటి..?
తండ్రి చాటు బిడ్డగా ఇంకెన్ని రోజులుండాలి..? ఎంత కష్టపడినా అది రాజమౌళి సినిమా అంటారే కానీ కార్తికేయ మూవీ అనరుగా..! ఈ లాజిక్ ఇప్పుడర్థం చేసుకున్నారు జక్కన్న తనయుడు. అందుకే తనకంటూ సపరేట్ రూట్ క్రియేట్ చేసుకుంటున్నారు కార్తికేయ. తండ్రిలా మెగాఫోన్ కాకుండా.. మరో దారిలో వెళ్తున్నారీయన. మరి ఆయన దారేంటి..? రాజమౌళి సినిమాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గానే కాదు.. వెనకాలుండి అన్నీ చూసుకుంటారు ఆయన తనయుడు కార్తికేయ.
Updated on: Mar 21, 2024 | 8:36 AM

రాజమౌళి సినిమాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గానే కాదు.. వెనకాలుండి అన్నీ చూసుకుంటారు ఆయన తనయుడు కార్తికేయ. కానీ ఇప్పుడీయన సొంత గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. అందుకే నిర్మాతగా వరస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు.

అది కూడా మలయాళ ఇండస్ట్రీపైనే కోట్లు ఖర్చు చేస్తున్నారు కార్తికేయ. ఈ మధ్యే ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేసారు జక్కన్న తనయుడు. కార్తికేయ జోరు చూసి దర్శకుడు అవుతారేమో అనుకుంటే.. నిర్మాతగా బిజీ అవుతున్నారు.

తాజాగా ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఒకే హీరోతో ప్రకటించి షాక్ ఇచ్చారు జక్కన్న తనయుడు. ఫహాద్ ఫాజిల్ హీరోగా ఆక్సీజన్‌తో పాటు డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలు అనౌన్స్ చేసారు కార్తికేయ. ఆర్కా మీడియాతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు కార్తికేయ.

డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాను శశాంక్ ఏలేటి తెరకెక్కిస్తుంటే.. ఆక్సీజన్‌తో సిద్ధార్థ్ నాదెల్ల మెగాఫోన్ పడుతున్నారు. పుష్ప సినిమాతో ఫహాద్‌కు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2లో నటిస్తున్నారు.

దాంతో ఫహాద్‌తో సౌత్ భాషలన్నింటిలోనూ ఈ 2 సినిమాలు నిర్మిస్తున్నారు కార్తికేయ. 2025లోనే ఈ రెండూ విడుదల కానున్నాయి. చూడాలిక.. ఫహాద్ సినిమాలతో కార్తికేయ జర్నీ ఎలా ఉండబోతుందో..?




