
జనవరిలో రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్‌కి ఇప్పటి నుంచే బజ్ సూపర్‌గా ఉంది. దానికి తగ్టట్టే ఈవెంట్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్‌లో చేయడానికి ఫిక్స్ అయ్యారు. రాజమండ్రి వేదికగా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ మిస్ అయితే కాకినాడగానీ, ఏలూరుగానీ వెన్యూ అవుతుంది.

కేవలం క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా చూపించడానికి అన్నట్టుగా కాకుండా చిట్టిబాబుకు ఉన్న చెవుడు కారణంగానే కథను మలుపు తిప్పటం రంగస్థలం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అందుకే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నారట.

పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్‌మెన్ అయినా.. ఒకే ఒక్కడు అయినా.. ఇండియన్ అయినా..!

కేవలం క్యారెక్టర్‌ను కొత్తగా చూపించడానికి అన్నట్టుగా కాకుండా, ఆ క్యారెక్టర్‌కు ఉన్న నత్తి కారణంగానే కథ మలుపు తిరిగేలా స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారట దర్శకుడు శంకర్. మరి రంగస్థలం విషయంలో వర్కవుట్ అయిన ఫార్ములా గేమ్ చేంజర్‌కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.