ఒక్క సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్, కోలీవుడ్‌లు వరస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇంతకీ ఆ చిన్నది ఎవరంటే? మమితా బైజు.
ప్రేమలు మూవీతో వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ చిన్నది. ఈ సినిమాలతో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఒక్క మూవీతోనే భారీ పాపులారిటి సంపాదించుకొని, ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది.
ప్రేమలు మూవీ తర్వాత ఈ బ్యూటీ ఏకంగా అరడజన్‌కు పైగా సినిమాలు లైన్లో పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు మలయాళంలో వరస ఆఫర్స్ వస్తున్నాయంట. కోలీవుడ్‌లో నాలుగు సినిమాల్లో అవకాశం రాగా, అందులో సూపర్ స్టార్ విజయ్ సరసన జననాయగన్ మూవీలో ఈ బ్యూటీ మెరవనున్నదంట.
అంతే కాకుండా స్టార్ హీరో ధనుష్ సినిమాలో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్‌కు పైగా సినిమాల్లో ఈ అమ్మడు మెరవనున్నదంట.
దీంతో మమితా బైజు లక్కీ గర్ల్.. ఒక్క సినిమాతోనే వరస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుందంటున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.