
సలార్ సినిమా ఎనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆ సినిమా కంటెంట్‌కు సంబంధించి రకరకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ కూడా ఓ మల్టీ మూవీ యూనివర్స్‌ను ప్లాన్ చేస్తున్నారని, అందులో భాగంగానే సలార్ కూడా రాబోతోందన్న న్యూస్ తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఈ వార్తలపై క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

కేజీఎఫ్ రెండు భాగాలతో నేషనల్ లెవల్‌లో పేరు తెచ్చుకున్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ జోరులోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. అయితే సలార్ ఎనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి ఈ సినిమాకూ, కేజీఎఫ్‌కు లింక్ ఉంటుందన్న ప్రచారం మొదలైంది.

సలార్ తొలి టీజర్ రిలీజ్ తరువాత కేజీఎఫ్‌తో లింకుల గురించిన టాక్ మరింత ఎక్కువైంది. సినిమా కలర్, థీమ్ ఒకేలా ఉండటం, కొన్ని షాట్స్ కేజీఎఫ్‌లో కనిపించిన లోకేషన్స్‌ను పోలి ఉండటంతో యూనివర్స్ కన్ఫార్మ్ అన్న కంక్లూజన్‌కు వచ్చేశారు ఆడియన్స్. అంతేకాదు సలార్‌లో యష్ గెస్ట్ అపియరెన్స్ కూడా ఉంటుందన్న న్యూస్ కూడా ట్రెండ్ అయ్యింది.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టేశారు ప్రశాంత్ నీల్. అసలు యూనివర్స్‌లు, మల్టీ వర్స్‌లు క్రియేట్ చేయటం తనకు రాదని, రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టేశారు. ఏ కథకు.. ఆ కథ సపరేట్‌గా రాసుకుంటానే తప్ప, ఒకదానికి ఒకటి లింక్ చేయటం తనకు తెలియదని చెప్పారు.

ప్రశాంత్ నీల్ ఇచ్చిన క్లారిటీతో సలార్‌కు కేజీఎఫ్‌కు లింక్ ఉంటుంది అంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అంతేకాదు భవిష్యత్తులో కేజీఎఫ్ 3 వచ్చినా... దాంట్లో ప్రభాస్ సలార్‌గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదని కూడా తేలిపోయింది.