
హనుమాన్ సక్సెస్ తరువాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే నెక్ట్స్ సినిమా గురించి పాన్ ఇండియా రేంజ్‌లో చర్చ జరుగుతోంది. తన దర్శకత్వంలో మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన ఈ యంగ్ డైరెక్టర్, త్వరలో ఓ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఏంటా సినిమా అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న ప్రశాంత్ వర్మ, ఒక్కో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్‌గా మహాకాళి పేరుతో మరో దర్శకుడితో సినిమాను ఎనౌన్స్ చేశారు.

అదే సమయంలో తన ఓన్ డైరెక్షన్‌లో మొదలు పెట్టబోయే సినిమా పనుల్లోనూ వేగం పెంచారు. ప్రజెంట్ లోకేషన్ సెర్చ్‌లో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్, డిసెంబర్ మొదటి వారంలో నందమూరి మోక్షజ్ఞ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

ఈ సినిమాలో బాలయ్య అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రశాంత్ మార్క్ పాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే ప్రతీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

ఓ లోకేషన్‌లో కోతులతో దిగిన ఫోటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ, 'మేం మళ్లీ కలిశాం... అంటే ఇది ఓ సూచన. దీపావళి రాబోతుంది' అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌తో దీపావళికి మోక్షూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు అభిమానులు.