
తెలుగులో తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది ప్రగ్యా జైస్వాల్. అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రగ్యా.. ఇప్పటివరకు సరైన బ్రేక్ అందుకోలేదు. అంతేకాదు.. స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలతోపాటు పలువురు స్టార్స్ సరసన నటించిన ప్రగ్యా.. ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. తాజాగా ఆమె ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ అందుకుంది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

కంచె సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ అందుకుంది. అలాగే బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ ఆ అదృష్టం ఆమెకు కలిసిరాలేదు.

ఈ సినిమా తర్వాత ప్రగ్యాకు అంతగా ఆఫర్స్ అంతగా రాలేదు. ప్రస్తుతం బాలయ్య నటిస్తోన్న అఖండ సీక్వెల్ అఖండ 2లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె సిల్వర్ చీరలో అందమైన జాబిలమ్మగా మెరిసిపోతుంది. వెండిమబ్బులలో మెరిసిన వెన్నెలమ్మగా కనిపిస్తుంది.

ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో చదివింది. సింబయాసిస్ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే అందాల పోటీలలో పాల్గొంది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ ఫెమినా మిస్ ఇండిాయ 2008లో పోటీల్లో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకుంది.