సినిమా ఇండస్ట్రీ మొత్తం తాజా సినిమాలతో బిజీ బిజీగా కనిపిస్తోంది. ఈ బిజీలో పడి మా డార్లింగ్‌ని మర్చిపోవద్దు అని అంటున్నారు యంగ్ రెబల్‌స్టార్ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల స్టేటస్‌ల గురించి ఇష్టంగా ఆరా తీస్తున్నారు. కల్కి సినిమా ఇచ్చిన కిక్‌ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ ఏడాది ప్యాన్ ఇండియా రేంజ్‌లో వెయ్యి కోట్లను టచ్ చేసిన హీరో మా వాడు మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటున్నారు.