
రిద్ధి కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన లవర్ సినిమాలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదనే చెప్పాలి.

రిద్ధి కుమార్ 2018లో లవర్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ హిందీ, మరాఠీ, మళయాళ ఇలా చాలా భాషల్లో వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అంతే కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించి మెప్పించింది.

ఇక ఈ బ్యూటీ తెలుగులో లవర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏ సినిమాలో ఈ అమ్మడు కనిపించలేదు. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి, రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ మూవీలో కీలక పాత్రలో కనిపించి, తెలుగు అభిమానుల మనసు దోచుకుంది.

చిన్న పాత్రలోనే తళుక్కున మెరిసింది. ఈ మూవీలో అర్చరీ ప్లేర్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రభాస్ మూవీలో చిన్న పాత్రలో నటించి, ఏకంగా ప్రభాస్ సరసనే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డార్లింగ్ సరసన ది రాజాసాబ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, పింక్ డ్రెస్‌లో సింపుల్ లుక్‌లో తన అందాలతో అందరినీ ఆగం చేస్తుంది. సెల్పీలలో తన క్యూట్ నెస్‌తో చంపేస్తుంది.