ఇప్పటిదాకా ఒక లెక్క. ఇంకపై ఇంకో లెక్క అంటున్నారట డార్లింగ్. 2024 దాకా ఏం జరిగిందన్నది హిస్టరీ. 2025 నుంచి ఏం చేయబోతున్నామన్నదే ప్లానింగ్ అంటూ నియర్ అండ్ డియర్స్ తో పక్కాగా చెప్పేస్తున్నారట.
ఇంతకీ డార్లింగ్ చేసే ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? అటూ ఇటూగా ఉన్న డార్లింగ్ కెరీర్‌ని గాడిలో పెట్టింది సలార్ మూవీ. ప్రశాంత్ నీల్ చేసిన మేజిక్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది యంగ్ రెబల్ స్టార్ కెరీర్.
కల్కి పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు నాగీ. ఈ లోపే కల్కి జపాన్ రిలీజ్‌కు రెడీ అయింది. డిసెంబర్ చివరి వారంలో కల్కి టీమ్ జపాన్ వెళ్లి.. ప్రమోషన్స్ చేస్తారని తెలుస్తుంది.
అయితే నియర్ ఫ్యూచర్‌లో ఈ ప్లానింగ్ మారబోతోందా? యస్ అనే అంటున్నాయి రెబల్ వర్గాలు. ఇప్పుడు రాజా సాబ్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఫౌజీ కూడా జరుగుతోంది.
ఇంకోవైపు సలార్2 స్టార్ట్ చేస్తానంటున్నారు ప్రశాంత్ నీల్. సో ఇన్నిటి మధ్య డార్లింగ్ అటూ ఇటూ షఫిల్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అయితే స్పిరిట్ నుంచి ఈ విధానంలో మార్పు కనిపిస్తుందన్నది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న మాట. స్పిరిట్‌లో మూడు లుక్స్ ఉంటాయట ప్రభాస్‌కి.
స్పిరిట్ నుంచి ఒక సినిమాకి ఒకేసారి బల్క్ డేట్స్ ఇచ్చేయాలని ఫిక్సయ్యారట డార్లింగ్. ఆ సినిమా లుక్స్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేసి, ఆ తర్వాతే మరో సెట్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారట.
ఒకవేళ ఆయన రెడీ కాని పక్షంలో ఆయా మూవీ యూనిట్స్.. ప్రభాస్ లేని పార్ట్ ని చిత్రీకరిస్తాయట. ప్రస్తుతానికి డార్లింగ్ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న క్లారిటీ ఇది.