
ప్రభాస్ బెస్ట్ లుక్ ఏంటి అంటే.. మిర్చి అని ఠక్కున చెప్పేస్తుంటారు ఆయన ఫ్యాన్స్. చేసే పనులు హార్డ్ వేర్ అయినా గానీ.. నీట్‌గా టక్ చేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లా ఉంటారు రెబల్ స్టార్. దాని తర్వాత బాహుబలి చేసారు కాబట్టి అప్పట్నుంచి బరువు పెరిగిపోయారీయన. మధ్యలో సాహో, రాధే శ్యామ్ కోసం కాస్త సన్నబడ్డా మిర్చి లుక్ అయితే రాలేదు.

బాహుబలి తర్వాత లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు ప్రభాస్. అందుకే ఆ పాత్రల కోసం బాగా మాస్ అవతారంలోకి మారిపోయారు రెబల్ స్టార్. సలార్, కల్కి కోసం మరింత రెబల్ లుక్‌లోకి వచ్చారు.

కానీ సెట్స్ మీద ఉన్న రాజా సాబ్, హను రాఘవపూడి ఫౌజీ సినిమాల కోసం మాత్రం బాగా మేకోవర్ అయ్యారు ప్రభాస్. రాజా సాబ్ టీజర్‌లో వింటేజ్ లుక్‌లో దర్శనమిచ్చారు.

రాజా సాబ్‌లో వింటేజ్ లుక్ మాత్రమే కాదు.. వింటేజ్ కామెడీ కూడా చేస్తున్నారు ప్రభాస్. అలాగే హను సినిమాలో మరింత సన్నగా మారిపోయారు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ లుక్ చూసి పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్.

ఇలా ఉంటే బొమ్మ బ్లాక్‌బస్టరే అంటూ మురిసిపోతున్నారు. మిర్చికి ఏ మాత్రం తగ్గని లుక్‌లోకి మారిపోయారు ప్రభాస్. కల్కి 2, స్పిరిట్‌లోనూ ఇదే లుక్ కంటిన్యూ చేయనున్నారీయన.