
2024 బిగెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ కల్కి 2898 ఏడి ఉంది. ఇది తెలుగులో 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ చేసిన ప్రభాస్ సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఓవర్అల్ విషయానికి వస్తే.. రెండో స్థానంలో ఉంది.

తెలుగులో 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి 2. తెలుగులో అధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ప్రభాస్ సినిమాల్లో రెండో స్థానం కైవసం చేసుకుంది. అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే థర్డ్ ప్లేస్‌లో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వచ్చిన సాలార్ పార్ట్ 1. దీంతో డార్లింగ్ సినిమాల్లో టాప్ 3లో నిలిచింది. ఓవర్అల్గా నాలుగవ స్థానంలో ఉంది సలార్ మూవీ.

తర్వాత తెలుగులో అధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ప్రభాస్ చిత్రాల్లో యాక్షన్ ఎంటర్టైనర్ సాహో కూడా ఒకటి. ఇది డిసాస్టర్ అయినప్పటికీ తెలుగులో మొత్తం 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్అల్లో టాప్ 5లో నిలిచింది ఈ సినిమా.

తర్వాత అత్యధిక తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ప్రభాస్ రాముడిగా కనిపించిన ఆది పురుష్. దీని కౌంట్ 240 కోట్లు. డార్లింగ్ సినిమాల్లో ఇది ఆరవ ప్లేస్‌లో ఉండగా.. అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే టాప్ 6లో ఉంది.

ఈ జాబితాలో ప్రభాస్ సినిమాల్లో టాప్ 6లో.. ఓవర్అల్గా టాప్ 8లో నిలిచిన సినిమా రోమాంటిక్ డ్రామా రాధేశ్యామ్. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.