ఎంతైనా ప్రభాస్ తోపు సామీ..! ఈ మాట మనం అంటున్నది కాదు.. ట్విట్టర్ అంతా కోడై కూస్తుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును కేవలం ప్రభాస్ మాత్రమే అందుకుంటే తోపే కదా అంటారు..! మరి ప్రభాస్ అంతగా ఏం సాధించారు..?
ఆయన సృష్టించిన ఆ కొత్త రికార్డ్ ఏంటి..? అసలు ట్విట్టర్‌లో అకౌంటే లేని ప్రభాస్ అక్కడేం చేసారో చూద్దామా..? నిజమే.. ప్రభాస్ ఎక్కడున్నా రాజే. తాజాగా ట్విట్టర్‌లో ప్రభాస్ దూకుడు చూసాక ఇదే అనిపిస్తుంది మరి.
అసలు ట్విట్టర్ అకౌంట్ కూడా లేని రెబల్ స్టార్.. అక్కడ రికార్డుల రూపు రేఖల్నే మార్చేస్తున్నారు. 2023లో ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసిన హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ పేరు ఉంది.
ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఇండియన్ హీరో ప్రభాస్ ఒక్కడే. ఇయర్ ఆన్ ఎక్స్ పేరుతో 2023లో టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఇన్ ఇండియా లిస్టు విడుదల చేసింది ట్విట్టర్. అందులో #NewProfilePic ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
#Crypto రెండో స్థానంలో.. #Leo మూడో స్థానంలో.. #Nft 4వ స్థానంలో.. #Jawan, #Pathaan 5,6 స్థానాల్లో ఉన్నాయి. ఇక #Prabhas 7వ స్థానంలో ఉంది. అలాగే 9వ స్థానంలో #Adipurush ఉంది.
2023లో ట్విట్టర్ వేదికగా ఎక్కువగా మాట్లాడుకున్న సినిమాల్లోనూ విజయ్ లియో టాప్ ప్లేస్‌లో ఉంది. దీని తర్వాత రెండో స్థానంలో సలార్ ఉండగా.. మూడో స్థానంలో వారిసు.. నాలుగో స్థానంలో అజిత్ తునివు..
5వ స్థానంలో జవాన్.. ఆరో స్థానంలో ఆదిపురుష్.. ఏడో స్థానంలో పఠాన్.. 8వ స్థానంలో డంకీ ఉన్నాయి. అటు హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్.. ఇటు సినిమాల్లో విజయ్ దూకుడు కొనసాగింది.