
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఈశ్వర్. ఈ సినిమాతో అటు కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది శ్రీదేవి విజయ్ కుమమార్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

తెలుగులో ఈశ్వర్, నిరీక్షణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాల్లో నటించి అలరించారు.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది శ్రీదేవి విజయ్ కుమార్. సినిమాల్లో కనిపించకపోయినా బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కొనసాగుతుంది ఈ అమ్మడు. డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న ఈ అమ్మడు వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ట్రెడిషనల్ లుక్స్ కు గ్లామర్ టచ్ ఇచ్చింది శ్రీదేవి విజయ్ కుమార్.

టాలీవుడ్ యాక్టర్ నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించి మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపై తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించనుంది.