
కల్కి 2898 ఏడీ సక్సెస్ జోష్‌లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్న ఫ్యాన్స్‌లో ఇప్పుడు ఆ జోష్ డబుల్ అవుతోంది. ఇంతకీ డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న ఆ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.?

దీంతో బాహుబలి తర్వాత మరోసారి వెయ్యి కోట్ల మూవీ చేసిన ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు.

తాజాగా అభిమానుల ఆనందాన్ని డబుల్ చేసే మరో న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య సలార్ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలితో జపాన్‌లోనూ ప్రభాస్‌కు మంచి ఫ్యాన్స్ బేస్ క్రియేట్ అయ్యింది.

ఆ నమ్మకంతోనే ఇప్పుడు సలార్‌ను అక్కడ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అనుకున్నట్టుగానే సలార్‌కు జపాన్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆల్రెడీ సాహో సినిమా రికార్డ్‌ను సమం చేసింది సలార్.

ఈ వారమే సాహో రికార్డ్‌ను బ్రేక్ చేయటం కన్ఫార్మ్ అయిపోయింది. ఇక్కడ కల్కి, అక్కడ సలార్ సినిమాలు భారీ వసూళ్లతో దూసుకుపోతుండటంతో డబుల్ జోష్‌లో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

కల్కి 2898 ఏడీని కూడా జపాన్‌లో రిలీజ్ చేస్తే అక్కడ డార్లింగ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయం అంటున్నారు.