
సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది నటి పూనమ్ కౌర్.

తాజాగా ఈ ముద్దుగుమ్మ విడాకుల గురించి ఓ ట్వీట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసింది.

విడాకులు తీసుకున్న మహిళలనే సమాజంలో ఇబ్బందులు పెడతారని, వారిని మాటలతో బాధిస్తారని రాసుకొచ్చింది.

మహిళల వల్లే పురుషులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయని సమాజం అంటుందని చెప్పింది.

ఇప్పటికి కూడా మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? అని ప్రశ్నించింది.

అయితే వెంటనే ఈ పోస్ట్ ను డిలీట్ చేయడంతో అసలు పూనమ్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందా అన్న చర్చ జరుగుతుంది.