Pooja Hegde: ఫ్లాపుల్లోనూ టాప్ లేపేస్తున్న హీరోయిన్

Edited By: Phani CH

Updated on: Sep 15, 2025 | 8:10 PM

ఈ రోజుల్లో ఒకట్రెండు ఫ్లాపులు వస్తేనే ఆ హీరోయిన్‌ను తీసి పక్కనబెడుతుంటారు దర్శకులు. కానీ ఇక్కడో హీరోయిన్‌కు మాత్రం ఎక్కడో లక్ ఉంది. అందుకే మూడేళ్లుగా ఫ్లాపులున్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ అందుకుంటూ.. మిగిలిన హీరోయిన్లకు అర్థం కాని ఫజిల్‌గా మారిపోయింది ఈ బ్యూటీ. ఇంతకీ ఎవరా హీరోయిన్..?

1 / 5
పూజా హెగ్డేకు సరైన హిట్ వచ్చి మూడేళ్లు దాటిపోయింది.. కమిటైన సినిమాలు ఆగిపోవడం.. విడుదలైన సినిమాలు ఆడకపోవడంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజా.

2 / 5
అక్కడ్నుంచి ఆదరణ బాగానే ఉంది. అక్కడ కూడా పూజా నటించిన రెట్రో, కూలీ సినిమాలు అంచనాలు అందుకోలేదు. తమిళంలో బిజీగానే ఉన్నారు పూజా. విజయ్ జన నాయగన్ సినిమాతో పాటు కాంచన 4లో నటిస్తున్నారు.

3 / 5
వీటితో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో మాత్రమే ఈమె కాస్త వెనకబడి ఉన్నారు. తాజాగా ఆ లోటు కూడా తీరిపోయింది. ఇక్కడ దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం వచ్చింది.

4 / 5
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా రెడీ అవుతుంది. ఇందులో కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

5 / 5
ఇష్క్ తర్వాత విక్రమ్, నితిన్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. దాంతో పాటు హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో నటిస్తున్నారు. వెబ్ సిరీస్‌లకు కూడా ఓకే అంటున్నారు పూజా.