
బ్యూటీ పూజా హెగ్దే గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఒక లైలా కోసం అంటూ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు ముకుంద సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఆ సినిమాలో గోపిక పాత్రలో నటించి, తన అందంతో టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకుంది.

ఇక ముకుంద మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరగా ఆఫర్స్ రావడంతో స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ నే షేక్ చేసింది ఈ చిన్నది.

కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవ్వడంతో పూజా క్రేజ్ తగ్గింది తెలుగులో, దీంతో బాలీవుడ్ , కోలీవుడ్ చెక్కేసి అక్కడ వరస సినిమాలతో బీజీ అయ్యింది.

కొన్ని రోజుల పాటు చాలా సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే ఆఫర్స్ అందుకుంటుంది. ఓవైపు సినిమాలు, మరోవైపు స్పెషల్ సాంగ్స్ అంటూ బిజీ అయిపోయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేసే ఈ చిన్నది తాజాగా, పొట్టి గౌన్ లో తన అందాలతో రెచ్చిపోయింది.

షార్ట్ గౌన్ ధరించి, ముద్దులతో రెచ్చిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.