
అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. యాంకర్‌గా రాణివ్వడమే కాకుండా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ, తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది.

పటాస్ కామెడీ షోతో తెలుగు అభిమానులకు పరిచయమైన ఈ చిన్నది, తన కామెడీ, పంచ్ డైలాగ్స్, అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఏ షోలనైనా సరే ఈ చిన్నది చేసే సందడి మాములుగా ఉండదు. లేదు. తన దైన తీరులో కామెడీ పండిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

పటాస్‌తో ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌కు వెళ్లి తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన ఆటతీరు, మాటతీరుతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ రన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక టాలీవుడ్ టాప్ మోస్ట్ యాంకర్లలో ఈ బ్యూటీ ఒకరు. ప్రస్తుతం వరసగా షోలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. స్టార్ మా వరస షోలకు యాంకర్‌గా చేస్తూ తన సత్తా చాటుతుంది. అంతే కాకుండా, బిగ్ బాస్ అగ్నీ పరీక్ష కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, స్టైలిష్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.