
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం క్రేజీ ట్యూన్స్‌ను సిద్ధం చేస్తున్నారట.. లెజెండరీ మ్యూజీషియన్ ఏఆర్ రెహమాన్. ఏంటా ట్యూన్స్ అనుకుంటున్నారా... అయితే వాచ్ దిస్ స్టోరీ.

రంగస్థలం తరువాత పెద్ది సినిమా కోసం మరోసారి ఊర మాస్ రోల్‌లో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజిక్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.

అందుకే మాస్ ఆడియన్స్‌ను ఉర్రతలూగించే సాంగ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందన్న విషయం కన్ఫార్మ్ అయ్యింది. ఆ పాటలో స్టార్ హీరోయిన్ సమంత, రామ్ చరణ్ సరసన ఆడిపాడితారన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్న చరణ్, సామ్ మరోసారి కలిసి నటిస్తున్నారన్న న్యూస్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిస్తోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో శ్రీకాకుళం జానపదానికి కూడా చరణ్ స్టెప్పేయబోతున్నారన్నది నయా అప్‌డేట్. ఈ పాటను తనదైన స్టైల్‌లో క్లాస్ మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కంపోజ్ చేస్తున్నారు సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్. ఈ అప్‌డేట్స్‌తో మెగా అభిమానుల్లో పెద్ది మీద అంచనాలు డబుల్ అయ్యాయి.