
ధనుష్ కోసం సేఫ్ జోన్ దాటేస్తున్న శేఖర్ కమ్ముల..

తాజాగా రామ్ చరణ్‌పై పాకిస్తానీలు ప్రశంసలు కురిపించారు. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా..? రాజమౌళి కారణంగా పాకిస్తాన్‌లోనూ మన సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. బాహుబలి పాక్‌లోనూ దుమ్ము దులిపేసింది. ఆ మధ్య ఓ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం పాక్ వెళ్లొచ్చారు జక్కన్న.

ఇప్పుడు RRR పుణ్యమా అని పాక్‌లో మళ్లీ మన హీరోలపై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా రామ్ చరణ్‌ను పాకిస్తానీ మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఈ వీడియో వైరల్అవుతుందిప్పుడు. చూస్తున్నారుగా.. ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ గురించి ఓ పాకిస్తానీ విశ్లేషకుడు చెప్తున్న మాటలు.

ట్రిపుల్ ఆర్‌కు దాయాది దేశంలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కేవలం చరణ్‌ను మాత్రమే కాదు.. తారక్ సైతం అక్కడ హాట్ ఫేవరేట్ అయిపోయారు. ఇక ప్రభాస్ అయితే బాహుబలి నుంచి పాక్ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో అయిపోయారు. అల్లు అర్జున్ సైతం పాకిస్తాన్‌లో బాగా పాపులర్. పుష్పతో బన్నీ ఫాలోయింగ్ ప్రపంచమంతా పెరిగిపోయింది.

అందులో పాక్ కూడా ఉంది. పుష్ప మేనరిజమ్స్ మాత్రమే కాదు.. పాటలు కూడా పాడుకుంటున్నారు పాకిస్తానీలు. ఒకప్పుడు పాక్‌లో సల్మాన్, షారుక్, అమీర్ మాత్రమే తెలుసు.. ఇప్పుడు ఖాన్స్ త్రయానికి మన చరణ్, బన్నీ, తారక్ త్రయం చెక్ పెడుతున్నారు.