రెండేళ్లుగా మన హీరోల రెమ్యునరేషన్‌లకు రెక్కలొచ్చాయి. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్ రేంజ్ 100 కోట్లు దాటితే.. మహేష్, పవన్, చిరంజీవి 70 కోట్ల కంటే ఎక్కువగా తీసుకుంటున్నారు. నాని, రవితేజ లాంటి హీరోలు సైతం 30 కోట్ల వరకు తీసుకుంటున్నారు. కానీ ఓటిటి రైట్స్ మోస్తరుగా తగ్గుతుండటం.. వీళ్ల పారితోషికంపై కూడా భారీగా ప్రభావం చూపించడం ఖాయం.