
దానికితోడు హిందీలో పాపులర్ షోలకు కూడా గెస్టులుగా వెళ్తున్నారు తారక్ అండ్ టీం. ఈ క్రమంలోనే కపిల్ శర్మ షోకు వెళ్లారు.. ఈ ప్రోమో కూడా వైరల్ అవుతుందిప్పుడు. దాంతో పాటే సందీప్ వంగాతో పూర్తిగా బాలీవుడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ముఖ్యంగా తొలి భాగంలో కథ, యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకటంతో ప్రారంభమైంది. కానీ క్యారెక్టర్ చూపించకుండానే పార్ట్ 1 ను ముగించారు.

కల్కి తర్వాత మరోసారి బాక్సాఫీస్ పోటెత్తాలంటే.. దేవర లాంటి సినిమా రావాల్సిందే. ట్రైలర్‌కు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వస్తున్నా.. అది కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు మేకర్స్.

అంచనాలు తగ్గిస్తే.. లాభాలే ఉన్నాయి కానీ నష్టాలైతే లేవు. కొరటాల శివ ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లోనే తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. అయితే దానికంటే ఒకరోజు ముందే సెప్టెంబర్ 26న అమెరికా, లాస్ ఏంజెల్స్‌లోని బియాండ్ ఫెస్ట్ 2024లో దేవరను ప్రదర్శించబోతున్నారు. ఎంతోమంది హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ హాజరు కానున్న ఈ ఈవెంట్‌కు దేవర యూనిట్ హాజరు కానున్నారు.

హాలీవుడ్ స్టేజ్‌లోనే తమ దేవరను పరిచయం చేయాలని చూస్తున్నారు తారక్ అండ్ టీం. గతంలో RRRతో ఎలాగూ అక్కడి ప్రేక్షకులకు కాస్తో కూస్తో చేరువయ్యారు ఎన్టీఆర్. ఆ గుర్తింపును ఇప్పుడు దేవరతో డబుల్ చేసుకోవాలని చూస్తున్నారు.

సింపుల్‌గా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ కోసం రాజమౌళి అప్పుడేసిన బాటను ఇప్పుడు దేవరకు వాడుకుంటున్నారు తారక్. బియాండ్ ఫెస్ట్ 2024లో దేవరతో పాటు హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ సేలమ్స్ లాట్, గాడ్జిల్లాలను ప్రదర్శించబోతున్నారు. మొత్తానికి వాటితో సమానంగా స్థానం కల్పించారంటే దేవర రేంజ్ ఏంటో అర్థమవుతుంది.