- Telugu News Photo Gallery Cinema photos North Heroine Kriti Sanon glamorous shows for Teri Baaton Mein Aisa Uljha Jiya movies Telugu Actress Photos
Kriti Sanon: వావ్.. వాట్ ఏ లుక్.! గ్లామర్ వరల్డ్‌లో సంథింగ్ స్పెషల్ గా కృతి సనన్..
స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే కమర్షియల్ సినిమాల్లో సత్తా చాటాలి. కానీ కృతి సనన్ మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కోసం చూస్తున్నారు. ముందు నటిగా పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా స్టార్ రేసులోకి వచ్చేస్తామని ఫీల్ అవుతున్నారు కృతి. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు నార్త్ బ్యూటీ కృతి సనన్.
Updated on: Feb 11, 2024 | 4:44 PM

స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే కమర్షియల్ సినిమాల్లో సత్తా చాటాలి. కానీ కృతి సనన్ మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కోసం చూస్తున్నారు.

ముందు నటిగా పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా స్టార్ రేసులోకి వచ్చేస్తామని ఫీల్ అవుతున్నారు కృతి. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు నార్త్ బ్యూటీ కృతి సనన్.

మిమి సక్సెస్ తరువాత అందం, అభినయం ఉన్న క్రేజీ కాంబినేషన్ అన్న పేరు రావటంతో టాప్ స్టార్స్ కూడా ఈ బ్యూటీతో జోడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో కృతి పేరు కూడా కనిపిస్తోంది.

మిమిలో సరోగసి మదర్ పాత్రలో నటించిన ఈ బ్యూటీ తరువాత ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మీద కాన్సన్‌ట్రేట్ చేశారు. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించారు.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. సీతగా కృతికి మంచి మార్కులే పడ్డాయి. ప్రజెంట్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాలకు కూడా రెడీ అంటున్న ఈ బ్యూటీ.. డిఫరెంట్ రోల్స్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఆ మధ్య బేడియా సినిమాలో గ్లామర్ షోకు దూరంగా షార్ట్ హెయిర్‌లో కనిపించారు కృతి. ఆ లుక్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ వినిపించినా... లైట్ తీసుకున్నారు.

తాజాగా 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ బ్యూటీ. ఈ సినిమాలో హ్యూమనాయిడ్ రోబో పాత్రలో నటించారు.

గ్లామరస్‌గా కనిపిస్తూనే.. రోబోగా తనదైన నటనతో మెప్పించారు. ఇలా వరుసగా ప్రయోగాలు చేస్తూ గ్లామర్ వరల్డ్‌లో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు కృతి సనన్.




