Rashmika Mandanna: నేషనల్ క్రష్‌కి ఇక పోటీనే లేదా.? పాన్ ఇండియా వైడ్‌గా దూసుకుపోతున్న బ్యూటీ

| Edited By: Ravi Kiran

Dec 06, 2024 | 7:37 PM

ఇండియన్ స్క్రీన్‌ కు పాన్ ఇండియా హీరోలను, దర్శకులను ఇచ్చిన క్రెడిట్ మాత్రమే కాదు పాన్ ఇండియా హీరోయిన్లను ఇచ్చిన క్రెడిట్‌ కూడా సౌత్ సినిమాదే. తాజాగా ఈ క్లబ్‌‌లోకి..

1 / 6
ఇండియన్ స్క్రీన్‌ కు పాన్ ఇండియా హీరోలను, దర్శకులను ఇచ్చిన క్రెడిట్ మాత్రమే కాదు పాన్ ఇండియా హీరోయిన్లను ఇచ్చిన క్రెడిట్‌ కూడా సౌత్ సినిమాదే. తాజాగా ఈ క్లబ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న మరో రేర్ రికార్డ్ సెట్ చేశారు. గ్లామర్‌ ప్లస్‌ పర్ఫామెన్స్‌ డెడ్లీ కాంబినేషన్‌ తో బాక్సాఫీస్‌ ను రూల్‌ చేస్తున్నారు. దీంతో ఈ రేంజ్‌ లో సత్తా చాటే బ్యూటీస్ ఇంకా ఎవరైనా ఉన్నారా అంటూ సెర్చింగ్ మొదలు పెట్టారు ఇండస్ట్రీ జనాలు.

2 / 6
సాధారణంగా గ్లామర్ రోల్స్ చేసే బ్యూటీస్‌ కు మంచి పర్ఫామర్ అన్న పేరు రాదు. మంచి పర్ఫామర్‌ గా పేరు తెచ్చుకున్న బ్యూటీస్ గ్లామర్ రోల్స్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించరు. కానీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాత్రం ఈ రెండింటినీ పర్ఫెక్ట్‌ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. దీనికితోడు కాస్త బోల్డ్‌ గా నటించేందుకు కూడా ఓకే అంటుండటంతో సెన్సేషనల్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు ఈ బ్యూటీ.

3 / 6
యానిమల్ సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా మార్కెట్‌ లో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక. ఈ సినిమాలో నటిగా డిఫరెంట్ వెరియేషన్స్‌ చూపించటంతో పాటు గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్టుగా నటించారు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ కావటంతో రష్మిక పేరు పాన్ ఇండియా రేంజ్‌ లో టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి అదే మ్యాజిక్‌ ను రిపీట్ చేశారు శ్రీవల్లి.

4 / 6
వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్‌ లో మెప్పించిన రష్మికకు ఇమిడియట్ కాంపీటిషన్‌ ఎవరు అన్న క్వశ్చన్‌ కు ఆన్సర్‌ కనిపించటం లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇండస్ట్రీలో సాయి పల్లవి, నిత్యా మీనన్‌ లాంటి టాప్‌ క్లాస్‌ పర్ఫామర్‌ లు ఉన్నా... వాళ్లెవరు గ్లామర్ విషయంలో రష్మికతో పోటి పడే పరిస్థితి కనిపించటం లేదు.

5 / 6
పూజా హెగ్డే లాంటి బ్యూటీస్ ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాల్లో ఫ్లాష్ అయినా... బెస్ట్ పర్ఫామర్‌ అన్న పేరు రాలేదు. దీనికి తోడు పూజ నటించిన పాన్ ఇండియా సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఈ బ్యూటీ మెయిన్‌ స్ట్రీమ్‌ కాంపిటీషన్‌ లో లేకుండా పోయారు.

6 / 6
 మృణాల్ థాకూర్‌ లాంటి వాళ్లు గ్లామర్ ఇమేజ్‌ తో పాటు నటిగానూ ప్రూవ్ చేసుకున్నా... ఇంకా పాన్ ఇండియా రేంజ్‌ లో ప్రూవ్ చేసుకోలేదు. దీంతో పాన్ ఇండియా రేంజ్‌ లో గ్లామర్ ఇమేజ్‌ తో పాటు నటిగానూ ప్రూవ్ చేసుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్నారు రష్మిక మందన్న.