
కొన్ని సిచ్యువేషన్స్‌లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా.. ఛిల్ అవ్వాలి..! జపాన్ సినిమాలో కార్తి చెప్పిన ఈ డైలాగ్‌నే ఇప్పుడు ఫాలో అవుతున్నారు శ్రీలీల. చేసేందుకు సినిమాలేం లేకపోవడంతో.. జస్ట్ ఛిల్ అవుతున్నారు ఈ బ్యూటీ.

దశ తిరిగేవరకు.. ఫోటోషూట్స్‌తో కాలం గడిపేయాలని ఫిక్సయ్యారు శ్రీలీల. తాజాగా మరో ఫోటోషూట్‌తో పిచ్చెక్కించారు ఈ భామ. గతేడాదంతా శ్రీలీలదే.. ముఖ్యంగా 2023 సెకండాఫ్‌లో నెలకో సినిమాలో కనిపించారు ఈ బ్యూటీ. స్కంద, ఆదికేశవ, భగవంత్ కేసరి, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం.. ఇలా 5 నెలల గ్యాప్‌లోనే అరడజన్ సినిమాలతో వచ్చారు.

గుంటూరు కారం తర్వాతే శ్రీలీల పూర్తిగా ఖాళీ అయిపోయారు. ఈ టైమ్‌ను కాస్త చదువుకు.. ఇంకాస్త ఎంజాయ్‌మెంట్‌కు వాడేస్తున్నారు ఈ డాక్టర్ బ్యూటీ. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉండటంతో.. కోలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల.

దానికోసం సమంతను మరిపించే హీరోయిన్ కావాలి. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్‌ని అనుకున్నా వర్కవుట్ కాలేదు. అందులో శ్రీలీల కూడా ఉన్నారు.. కానీ కాంబో కుదర్లేదు.

రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పని చేస్తున్న శ్రీలీల.. ఇప్పుడు ఖాళీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈమె న్యూ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్లాక్ డ్రెస్‌లో అమ్మడు మతులు చెడగొడుతున్నారు. సమ్మర్ ట్రిప్ తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేయనున్నారు ఈ బ్యూటీ. అప్పటివరకు ఛిల్ అవ్వడమే పనిగా పెట్టుకున్నారు.