AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: అందం ఈ సుకుమారి ప్రేమకై తపిస్తోంది.. గార్జియస్ నిధి..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైదరాబాద్ అమ్మాయి.. తొలి సినిమాతో డిజాస్టర్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రావడం లేదు. తర్వాత తెలుగులో అరకొర సినిమాలు చేసినా.. ఫాలోయింగ్ పెరిగింది కానీ నటిగా సరైన గుర్తింపు మాత్రం రాలేదు. మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది.

Prudvi Battula
|

Updated on: Jan 29, 2025 | 6:15 PM

Share
  17 ఆగస్టు 1993న తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లో జన్మించింది వయ్యారి భామ నిధి అగర్వాల్. పెరిగింది మాత్రం బెంగుళూరులో. హిందీ మాట్లాడే మార్వాడీ కుటుంబంలో జన్మించినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ భాషలను అర్థం చేసుకోవడంతోపాటు మాట్లాడగలదు ఈ బ్యూటీ.

1 / 5
 2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొంది అందాల భామ నిధి అగర్వాల్. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.  హిందీలో మున్నా మైకెల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ కు మకాం మార్చింది.

2 / 5
 తెలుగులో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ భామ ఆతర్వాత అక్కినేని అఖిల్ కు జోడిగా మిస్టర్ మజ్ను సినిమాలో చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

3 / 5
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ బ్యూటీకి భారీ హిట్ అందించింది. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. 

4 / 5
ఆమె అనేక బ్రాండ్‌లకు యాక్టివ్ సెలబ్రిటీ ఎండోర్సర్. 2019లో ఆమె ఫెయిర్‌నెస్ క్రీమ్ ఎండార్స్‌మెంట్‌ను తిరస్కరించింది. కళ్యాణ్ జ్యువెలర్స్ బహుభాషా ప్రకటనలో కూడా భాగమయ్యింది ఈ బ్యూటీ. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో కనిపించింది. ఆమె 2019లో 11వ స్థానంలో, 2020లో 8వ స్థానంలో నిలిచింది.

5 / 5