New Heroines in Tollywood: టాలీవుడ్ లో కొత్త అందాలు.. శ్రీలీల, మృణాల్ ఛాన్స్ లు మిస్.
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు రావడం అనేది ఓ ఆనవాయితీ. పాతనీరు పోవడం.. కొత్త నీరు రావడం అలా జరిగిపోతూ ఉంటుందంతే..! మొన్నటి వరకు ఏ సినిమాలో చూసినా అయితే శ్రీలీల.. లేదంటే మృణాళ్ కనిపించేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ కాకుండా.. మరో ముగ్గురు నలుగురు కొత్త ముద్దుగుమ్మలు రేసులోకి వచ్చేసారు. మరి వాళ్లెవరు..? కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కష్టపడిన శ్రీలీల.. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.