Rajeev Rayala | Edited By: Basha Shek
Aug 04, 2022 | 6:12 AM
డీజే టిల్లు సినిమా తో సిద్దు జొన్నలగడ్డ కు ఎంతటి పేరు వచ్చిందో.. అంతే పేరు హీరోయిన్ నేహా శెట్టికి వచ్చింది
ఈ అమ్మడు ఆ సినిమా లో అందాలతో అదరగొట్టేసింది. సినిమాలో ఎక్కువ శాతం చీర కట్టులో ఉన్నా కూడా అందం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా అందరినీ ఆకట్టుకుంది.
అప్పటి నుంచి కూడా ప్రేక్షకులు నేహా శెట్టి కి బదులుగా రాధిక అనే ఎక్కువగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోల పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
డీజే టిల్లు తర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అవుతుందని అంతా భావించారు. కాని ఈ అమ్మడు మాత్రం ఆచితూచి సినిమాల ను ఎంపిక చేసుకుంటుంది.
హీరోయిన్ గా డీజే టిల్లు 2 లో కూడా ఈమె ఉంటుందా అంటే ప్రస్తుతానికి సమాధానం లేదు. త్వరలోనే ఈ విషయమై యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.