
నయనతార డాక్యుమెంటరీపై కోలీవుడ్ హీరో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ షోలో తన బ్యానర్‌లో నిర్మించిన నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్‌ను అనుమతి లేకుండా వాడినందుకు పది కోట్లు చెల్లించాలంటూ కాపీ రైట్ కంప్లయింట్ ఇచ్చారు. ఈ విషయంపై సీరియస్‌గా స్పందించిన నయన్, ధనుష్‌కు ఓపెన్ లెటర్ ద్వారా సమాధానమిచ్చారు.

పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల ఇంకా ఆ ఎగ్జైట్మెంట్‌లోనే ఉన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఈ ఐదారు రోజులు బన్నీతో కలిసి వర్క్ చేయటం ఓ క్రాష్ కోర్సులా ఉందన్నారు శ్రీలీల.

ఐఫా కాంట్రవర్సీ విషయంలో క్లారిటీ ఇచ్చారు యంగ్ హీరో తేజ సజ్జ. 'ఐఫా అనేది జాతీయ స్థాయి వేడుక. చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ దీని కోసం వర్క్ చేస్తారు. అంతా ఓకే అనుకున్న తరువాతే ఆ స్క్రిప్ట్ మాకు ఇస్తారు. క్లిప్ చూడటం వల్ల అభిమనులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఫుల్ వీడియో చూస్తే అలా ఉండదు' అన్నారు.

గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ నెల 20 ఈ సినిమా నుంచి థర్థ సింగిల్ రాబోతుందన్నారు. పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన తమన్ ఈ అప్‌డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఐకానిక్ మూవీ దళపతి. ఈ సినిమాను రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 1991లో రిలీజ్ అయిన దళపతి అప్పట్లో సంచలన విజయం సాధించింది.