
నయనతార లీడ్ రోల్‌లో తెరకెక్కిన డివోషనల్ ఫాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది.

అందుకే ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు మేకర్స్.సీక్వెల్‌లో అమ్మవారి పాత్రలో త్రిష నటిస్తారన్న ప్రచారం జరిగినా... ఫైనల్‌గా మరోసారి నయనతారనే సెలెక్ట్ చేశారు మేకర్స్.

ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీకి హారర్ సినిమాల స్పెషలిస్ట్ సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సినిమాను సూపర్ హిట్‌గా నిలబెట్టిన బాలాజీ సీక్వెల్‌కు దర్శకత్వం వహించకపోవటంపై స్పందించారు.

పార్ట్ 2 చేసే ఆలోచన తనకు అసలు లేదన్న బాలాజీ, నయనతార సీక్వెల్ చేయాలన్న ప్రపోజల్ పెట్టినప్పుడు తాను నో చెప్పా అన్నారు. అందుకే ఆమె మరో దర్శకుడితో ఆ సినిమా చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

ఆర్జే బాలాజీని వెండితెరకు పరిచయం చేసింది సుందర్ సీనే. అందుకే ఆయన తన సినిమా సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాలాజీ. మరి హారర్ సినిమాలతో వరుస సక్సెస్‌లు సాధించిన సుందర్ సీ, డివోషనల్ మూవీని ఎలా డీల్ చేస్తారో చూడాలి.