Hi Nanna: నాని ఖాతాలో మరో “మిలియన్” మార్క్.. ఓవర్సీస్‌లో టాప్ లేపుతున్న హాయ్ నాన్న

| Edited By: Phani CH

Dec 12, 2023 | 5:40 PM

చల్లగా చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటుంటారు నాని. ఎంతమంది హీరోలున్నా.. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆ ఒక్క ఏరియాలో మాత్రం మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయారు న్యాచురల్ స్టార్. ఇంట గెలిచినా ఓడినా.. రచ్చ మాత్రం ప్రతీసారి గెలుస్తూనే ఉన్నారీయన. తాజాగా హాయ్ నాన్నతో మరోసారి ఓవర్సీస్‌లో టాప్ లేపేస్తున్నారు నాని. పక్కింటి అబ్బాయిలా కనిపించే నానిని చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది.. పైగా ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి. టాక్‌తో సంబంధం లేకుండా నాని సినిమా చూడాలనుకునే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు.

1 / 5
చల్లగా చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటుంటారు నాని. ఎంతమంది హీరోలున్నా.. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఆ ఒక్క ఏరియాలో మాత్రం మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయారు న్యాచురల్ స్టార్. ఇంట గెలిచినా ఓడినా.. రచ్చ మాత్రం ప్రతీసారి గెలుస్తూనే ఉన్నారీయన. తాజాగా హాయ్ నాన్నతో మరోసారి ఓవర్సీస్‌లో టాప్ లేపేస్తున్నారు నాని.

2 / 5
పక్కింటి అబ్బాయిలా కనిపించే నానిని చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది.. పైగా ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి. టాక్‌తో సంబంధం లేకుండా నాని సినిమా చూడాలనుకునే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అందులోనూ ఓవర్సీస్ అయితే నాని నటనకు ఫిదా అయిపోయింది. అక్కడ్నుంచి మిలియన్ మార్క్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా హాయ్ నాన్న సైతం మిలియన్ మార్క్ అందుకుంది.

3 / 5
ఒకటి రెండు కాదు.. ఏకంగా 9వ సారి మిలియన్ మార్క్ అందుకున్నారు నాని. ఓవర్సీస్‌లో ఈ ఫీట్ సాధించిన మీడియం రేంజ్ హీరో మరొకరు లేరు. ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు తర్వాత అంత కన్సిస్టెంట్‌గా ఓవర్సీస్ ఆడియన్స్‌కు నచ్చిన హీరో నాని ఒక్కరే. ఈగ నుంచే నాని బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైంది. అక్కడ్నుంచే ఓవర్సీస్ ప్రేక్షకులకు నాని నచ్చేయడం మొదలు పెట్టారు.

4 / 5
2012లో మొదటిసారి ఈగతో మిలియన్ మార్క్ అందుకున్న నాని.. భలే భలే మగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసిఏ, జెర్సీ, అంటే సుందరానికి, దసరా సినిమాలతో మిలియన్ డాలర్ మార్క్ అందుకున్నారు. ఇందులో అంటే సుందరానికి మన దగ్గర ఆడలేదు.. కానీ అక్కడి ఆడియన్స్ మాత్రం ఆదరించారు.

5 / 5
హాయ్ నాన్నకు సైతం మొదటిరోజు నుంచే ఓవర్సీస్‌లో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మూడు రోజుల్లోనే మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. శౌర్యు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 9 సార్లు మిలియన్ మార్క్ చేరడం అంటే చిన్న విషయమేం కాదు.. అందుకే ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న నాని.. అక్కడి ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్తున్నారు.