
సినిమా సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నపుడు కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరుగుతాయి. నాని విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. నిన్నమొన్నటి వరకు కథ డిమాండ్ చేసినా.. మార్కెట్ గురించి ఆలోచించి బడ్జెట్ దగ్గర వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఫ్రీ హ్యాండిస్తున్నారు. నాని నెక్ట్స్ సినిమాల బడ్జెట్ ఊహకు కూడా అందట్లేదు. అంత నమ్మడానికి కారణమేంటి..?

ప్రజెంట్ పవన్ ఓజీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సుజిత్, నెక్ట్స్ నానితో కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు. మూడు సినిమాలతో బిజీగా ఉన్న నాని,

అందుకే మరోసారి అదే కాంబోను రిపీట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నారు.

నాని తర్వాతి సినిమాల బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే ప్రాజెక్ట్ బడ్జెట్ 100 కోట్ల వరకు ఉండబోతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ మధ్యే గ్రాండ్‌గా సినిమాను ఓపెన్ చేసారు. పాన్ ఇండియన్ స్థాయిలోనే నాని ఓదెల సినిమా రాబోతుంది.

నాని లైనప్ చాలా బలంగా ఉంది. ఈయన తర్వాతి సినిమా సుజీత్‌తో ఉండబోతుంది.. అలాగే శ్రీకాంత్ ఓదెల, శైలేష్ కొలను సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో ఏ సినిమాకు బడ్జెట్ లిమిటేషన్స్ లేవు. మొత్తానికి బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు న్యాచురల్ స్టార్. మినిమమ్ గ్యారెంటీ కావడంతో నిర్మాతలు కూడా సై అంటున్నారు.