


బాలయ్యను మరోసారి కొత్తగా ఆడియన్స్‌కు పరిచయం చేసిన ఈ సినిమా వసూళ్ల పరంగానూ నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో రికార్డ్స్ సెట్ చేసింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కావాలన్న డిమాండ్స్ గట్టిగా వినిపించాయి.


అందుకే అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా సెట్స్‌పైకి వచ్చేలా ఉంది బాలయ్య, బోయపాటి సినిమా. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో 14 రీల్స్, బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈయన కమిటైన బాలయ్య బాబీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు బాబీ.

అఖండ 2 అనుకున్న టైమ్‌కు మొదలవుతుందా..? లేదంటే ముందు ప్లాన్ చేసిన దానికంటే ఆలస్యం కానుందా..? ఉన్నట్లుండి ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు కదా..?