
కొన్ని సినిమాలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఎంత దూరమైనా దూకేయాలనిపిస్తుంది. సాయితేజ్ కెరీర్‌లో విరూపాక్ష అలాంటి సినిమానే. ఆ మూవీ ఇచ్చిన నమ్మకంతోనే ఇప్పుడు ఆయన సంబరాల ఏటి గట్టు చేస్తున్నారు.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మామూలు ఎక్స్ పెక్టేషన్స్ లేవు.. విరూపాక్ష కా బాప్ లా ఉంటుందనే ఫీలర్స్ వినిపిస్తున్నాయి మెగా కాంపౌండ్‌లో.

విరూపాక్షను తెరకెక్కించిన కార్తిక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో సినిమా చేస్తున్నారు. థింక్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్ ని నమ్మే కార్తిక్, ఇప్పుడు చైతూతో చేస్తున్నది సోషియో ఫాంటసీ సబ్జెక్ట్. స్క్రిప్ట్ ఊహాతీతంగా ఉంటుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. తండేల్ సక్సెస్ మీదున్న చైతూ.. కార్తిక్ కోసం మేకోవర్ అవుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో సిద్ధు సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే టాక్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ కాంబోలో తెరకెక్కే కోహినూర్ మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ హై లెవల్లో ఉన్నాయి. కోహినూర్ అనే పదంలోనే ఏదో పాజిటివిటీ వినిపిస్తుంది. అలాంటిది సిద్ధు ఆ టైటిల్‌తో మూవీ చేస్తున్నారంటేనే భారీగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్.

విజయ్ దేవరకొండ చేతిలో ఉన్న సినిమాలన్నీ సమ్‌థింగ్ స్పెషల్ సబ్జెక్టులతో సిద్ధమవుతున్నవే ఈ మధ్య టీజర్‌తో మెప్పించిన కింగ్ డమ్ మాత్రమే కాదు, నెక్స్ట్ లైన్‌లో ఉన్నవి కూడా ప్రేక్షకుల ఊహాతీతమైన పాయింట్‌లే... మీరెంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది బొమ్మ.. అంటూ బౌండరీలు బద్ధలు కొట్టడానికి సిద్ధమవుతున్నారు యంగ్ హీరోలు.