Nag Ashwin: అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 

Edited By:

Updated on: Mar 26, 2025 | 7:55 PM

ఎవడే సుబ్రమణ్యం పదేళ్ళ జర్నీ పుణ్యమా అని నాగ్ అశ్విన్ మరోసారి ట్రెండ్ అవుతున్నారు. పనిలో పనిగా ఎవడే ముచ్చట్లతో పాటు.. కల్కి 2 సంగతులు కూడా పంచుకుంటున్నారు. కల్కి 2 సెట్స్‌పైకి వచ్చేలోపు నాగీ మరో సినిమా చేస్తాడంటూ వార్తలొస్తున్నాయి. మరి దానిపై ఆయనేం అంటున్నారు..? నిజంగానే కల్కి 2 కంటే ముందు మరో సినిమా చేస్తారా..?

1 / 5
కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్‌గానే ఉన్న ఈయన.. ఇప్పుడు ఏకంగా ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు నాగ్ అశ్విన్.

2 / 5
తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నారు నాగీ. ఎవడే సుబ్రమణ్యం పదేళ్ళ జర్నీతో మరోసారి ట్రెండ్ అవుతున్నారు ఈ దర్శకుడు.

3 / 5
ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీ. ఓవైపు రాజా సాబ్ చేస్తూనే.. మరోవైపు హను రాఘవపూడి సినిమా కోసం డేట్స్ ఇచ్చారు. దీని తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ చేయబోతున్నారు. ఈ మూడూ అయ్యాకే కల్కి 2 వైపు వస్తారు రెబల్ స్టార్.

4 / 5

ఇవన్నీ అవ్వడానికి కనీసం రెండేళ్లైనా పడుతుంది. ఈలోపు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తారనే వార్తలొచ్చాయి.. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పటికే మహానటితో చరిత్ర సృష్టించారు నాగ్ అశ్విన్.

5 / 5
దాంతో కల్కి 2 వచ్చేలోపు మరో సినిమా చేస్తారనుకున్నారంతా. కానీ తన ఫోకస్ అంతా ప్రభాస్ సినిమాపైనే ఉందన్నారు నాగీ. మరో సినిమా గురించి ఆలోచించట్లేదని చెప్పారు. అన్నీ కుదిర్తే డిసెంబర్ 2025 నుంచి కల్కి 2 మొదలుపెడతామన్నారు. ఒకవేళ లేటైనా.. ఇదే తన తర్వాతి సినిమా అన్నారాయన.