
పాన్ ఇండియా అంటే కేవలం హీరోలు మాత్రమేనా.. మేం కాదా అంటున్నారు నిర్మాతలు. అందుకే అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్‌తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

హిందీ, తమిళం, మలయాళంలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. దాదాపు 2000 కోట్లు ప్రొడక్షన్‌లో పెట్టారు వీళ్లు. దిల్ రాజు ఇప్పటికే తెలుగుతో పాటు తమిళం, హిందీలో సినిమాలు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్, అశ్వినీ దత్ లాంటి వాళ్లు ఎప్పుడో చేసారిది.

ఇకిప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా తమ నిర్మాణాన్ని పక్క ఇండస్ట్రీల వైపు విస్తరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో మోస్ట్ బిజియెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ ఇదే. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి 10 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్ల వరకు ఉంటే.. బిజినెస్ 500 కోట్ల మేర జరుగుతుంది.

అలాగే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా కూడా ఇదే బ్యానర్‌లో రాబోతుంది. దీని బడ్జెట్ 300 కోట్లు అయితే.. బిజినెస్ రేంజ్ దానికి రెండింతలు ఉంటుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పేరుకు తెలుగు సినిమా అయినా.. రేంజ్ మాత్రం 200 కోట్లకు పైనే ఉంది. ఇక RC 16, RC17 బడ్జెట్ 500 కోట్ల పై మాటే.

తమిళ, మలయాళంపై ఫోకస్ చేసారు మైత్రి. మలయాళంలో టోవినో థామస్‌తో నడిగర్ తిలకం సినిమా నిర్మిస్తున్నారు. ఇక తమిళంలో అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను 200 కోట్లతో ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. హిందీలో గోపీచంద్ మలినేని, సన్ని డియోల్ సినిమా నిర్మిస్తున్నారు. అలాగే మంజిమల్ బాయ్స్, ఆడుజీవితం సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు.