ఆగస్టు 15 క్యాలండర్‌లో మార్క్ చేసుకోండి. పుష్పగాడి రూలింగ్ ఎలా ఉంటుందో హాయిగా చూద్దురుగానీ అని అంటున్నారు కెప్టెన్ సుకుమార్. ఫస్ట్ పార్టుతో పోలిస్తే, సెకండ్ పార్టు పదింతలు బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులోనూ జాతర ఎపిసోడ్ గురించి వినిపిస్తున్న మాటలు అల్లు ఆర్మీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పుష్ప సినిమాలో మీనింగ్‌ఫుల్ యాక్షన్‌కీ, కడుపుబ్బా నవ్వించే సీన్స్ కీ, ఇంటెన్సిటీతో సాగే ఎపిసోడ్స్ కీ, పర్ఫెక్ట్ రొమాంటిక్ షాట్స్ కీ కొదవేలేదు.