
చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉందని కాన్సెప్టులు ఒప్పుకునే రకం కాదు నేను అని గట్టిగా చెప్పేస్తున్నారు నటి మృణాల్ ఠాకూర్. జస్ట్ పాటల కోసం, ఏవో కొన్ని సీన్ల కోసం ఎప్పుడూ సినిమాలను ఒప్పుకోలేదన్నది ఈ బ్యూటీ మాట.

సినిమా చేశానంటే, ఆ సినిమాకు, అందులో నా కేరక్టర్‌కీ వేల్యూ ఉండేలా చూసుకుంటా. సీతారామమ్, హాయ్ నాన్న మూవీస్ చూసిన వారికి ఆ విషయం అర్థమవుతుంది అని ఓపెన్ అయ్యారు మృణాల్. ఆమె మాటలను బట్టి, ఫ్యామిలీస్టార్‌లో సిల్వర్‌స్క్రీన్ సీతమ్మ కేరక్టర్ ఎలా ఉంటుందోనని ఊహించుకున్నారు ఫ్యాన్స్.

ఎగిరి పోతే ఎంత బావుంటుంది అనే పాట విన్న వాళ్లందరికీ వేదం సినిమాలో అనుష్క కేరక్టర్ గుర్తుకొస్తుంది. ఆ కేరక్టర్‌ని అంత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు డైరక్టర్ క్రిష్ జాగర్లమూడి. కేరక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్స్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారనే పేరుంది క్రిష్ జాగర్లమూడికి.

ఆయన డైరక్షన్‌లోనే అనుష్క ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారన్నది టాక్. మరోవైపు మలయాళంలో కథనార్ అనే సినిమా కూడా సెట్స్ మీదుంది అనుష్కకు. తెలుగులో భాగమతి సీక్వెల్ ఎలాగూ అనౌన్స్ అయి ఉంది. వీటన్నిటినీ బట్టి, గత కొన్నేళ్లతో పోలిస్తే 2024లో స్వీటీ కాల్షీట్లు చకచకా నిండిపోతున్నాయన్నమాట.

రవితేజ హీరోగా నటించిన ఈగిల్ విడుదలైంది. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని డైరక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈగిల్ యుద్ధకాండ పేరుతో సినిమా విడుదలవుతుందని హింట్ ఇచ్చారు. అయితే ఇప్పటికే షూటింగ్ చేశారా? లేకుంటే, ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి రేసులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సోలో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసి ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.