Actress Anjali: అట్టహాసంగా ప్రముఖ నటి సీమంతం.. తరలివచ్చిన తారాలోకం.. ఫొటోలు చూశారా?

Edited By: Rajitha Chanti

Updated on: Jun 26, 2025 | 10:03 AM

సీరియల్స్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది అంజలి. త్వరలో ఆమె తల్లి కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సీమంతం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

1 / 6
 చాలా మందికి ఫేవరెట్ అయిన 'మొగలిరేకులు' సీరియల్‌తోనే  నటిగా కెరీర్ ప్రారంభించింది అంజలి.  ఈ సూపర్ హిట్ సీరియల్ లో తన అందం, అభినయంతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుందీ అందాల తార.

2 / 6
 దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ లో నటించింది అంజలి. కొన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తే.. మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ

3 / 6
 సీరియల్స్ తో కొన్ని సినిమాల్లోనూ సహాయక నటిగా మెప్పించింది అంజలి. బాలకృష్ణ లెజెండ్, అక్కినేని నాగ చైతన్య ఒక లైలా కోసం తదితర సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.

4 / 6
 సినిమాలు, టీవీ సీరియల్స్ సంగతి పక్కన పెడితే.. 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది అంజలి. ఈ దంపతులకు ఇప్పటికే  చందమామ అనే కూతురు ఉంది.

5 / 6
 ఇప్పుడీ అందాల తార రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించిందామె. తాజాగా అంజలి సీమంతం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు తరలిచ్చారు.

6 / 6
 యాంకర్ స్రవంతి, అర్జున్ అంబటి, శ్వేతా నాయుడు, యష్మీ, భానుశ్రీ, సమీరా, రీతూ చౌదరి, ఆర్జే కాజల్, విశ్వ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్ తదితరులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.