
హిందీ సినిమాలు చూసేవారికి స్వరా భాస్కర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓవైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుందీ అందాల తార.

సినిమాల సంగతి పక్కన పెడితే తరచూ వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. చివరకు తన పెళ్లి కూడా కాంట్రవర్సీగా మారింది. ప్రముఖ పొలిటికల్ లీడర్, ఎస్పీ నేత ఫహద్ అహ్మద్‌తో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లిపీటలెక్కింది స్వరా భాస్కర్.

కాగా ఫహద్‌తో కలిసి పలు పొలిటికల్ ఈవెంట్లకు, ఫంక్షన్లకు హాజరైంది స్వరా. ఈక్రమంలోనే వారి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఫహాద్‌ను వివాహం చేసుకోవడంపై చాలామంది ఆమెను విమర్శించారు.

ఈ సంగతి పక్కన పెడితే తన ఫస్ట్ నైట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరో కాంట్రీవర్సీని క్రియేట్ చేసింది స్వర. ఇదిలా ఉంటే త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది అందాల తార.

ఈక్రమంలో తనకు పుట్టబోయే బిడ్డకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోంది. తన చిన్నారి కోసం ఓ అందమైన ఊయలను రెడీ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్‌గా మారాయి.