
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తన ప్రియుడు సాయి విష్ణుతో కలిసి మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుందీ అందాల తార. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.

నిశ్చితార్థం జరిగిన వెంటనే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులను కలసి నేరుగా తన పెళ్లికి ఆహ్వానించింది మేఘా ఆకాశ్. రజనీకాంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులను ఆమె కలిసింది.

త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పనున్న ఈ అందాల తార ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలసి శ్రీలంకకు వెళ్లింది. అక్కడే గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ చేసుకుంది.

తన బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మేఘా ఆకాశ్. దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి

మేఘా ఆకాష్ తెలుగులో లై, చల్ మోహన్ రంగ, రాజా రాజ చోర.. డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, మనుచరిత్ర తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్ మేగా ఆకాశ్.. వివాహం తర్వాత కూడా మళ్లీ సినిమా కెరీర్ సాగిస్తుందో లేదో చూడాలి.