Chiranjeevi: గోల్ అంటే ఇలా ఉండాలి.! పక్క ప్లానింగ్ తో ఈసారి బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..
గోల్ అంటే ఎలా ఉండాలి? రాత్రింబవళ్లు అదొక్కటే ఆలోచనతో ఉండాలి. దాన్ని రీచ్ అయ్యేవరకు అసలు ఇంకో ధ్యాసలేనట్టు పనిచేయాలి. ఎన్ని పనుల మధ్య ఉన్నా.. ఫుల్ ఫోకస్ మాత్రం లక్ష్యం మీదే ఉండాలి. ఇప్పుడు అలాంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు మెగాస్టార్. సంక్రాంతికి ధమాకా సక్సెస్ చూడాలన్నదే ఇప్పుడు ఆయన ధ్యేయం.. పూనకాలు లోడింగ్ అంటూ లాస్ట్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి చేసిన సందడి ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మారుమోగుతూనే ఉంది.